This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు - లక్షణాలు & మేనేజ్మెంట్ (High Blood Pressure During Pregnancy in Telugu)

Blood Pressure
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు - లక్షణాలు & మేనేజ్మెంట్ (High Blood Pressure During Pregnancy in Telugu)
Likes8 Likes|
Read time12 min

ఆడవారిని సంతోషింపజేయటం అంత తేలిక కాదని అంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగా వారిని ఆనందపరచే మాట తల్లి కాబోతున్నారనే కబురు. మనలో ఒక జీవి ప్రాణం పోసుకుంటోందనే అనుభూతి చాలా గొప్ప భావన. మన ప్రాధాన్యతలన్నీ మారిపోతాయి. ఆ బిడ్డ ఆరోగ్యంగా, క్షేమంగా పుట్టటం కోసం ఏమి చేయటానికైనా వెనుకాడం. ప్రెగ్నెన్సీ సమయం ప్రతి ఒక్కరికీ హాయిగా గడిచిపోతుంది అనుకున్నారా? దురదృష్టవశాత్తు అలా ఉండదు. గర్భిణీ అయిన స్త్రీ శారీరకంగాను, మానసికంగాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, అశాంతి, నీరసం మొదలైనవి ఎన్నో అనుభవిస్తుంది. ఒక స్త్రీ ఒక బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే ప్రక్రియలో వీటిలో కొన్ని హానికారకమైనవి, కొన్ని ప్రాణాంతకమైనవి కూడా. కనుక మీకు, మీ బిడ్డకు సమస్య కాకముందే, ఈ సమస్యలను గుర్తించటం చాలా అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన అధిక రక్తపోటు గురించి ఈరోజు చర్చించుకుందాం. దానివల్ల ఎదురయ్యే చిక్కుల గురించి కూడా సవివరంగా మాట్లాడుకుందాం, రండి.

అధిక రక్తపోటు అంటే ఏమిటి? (What is High Blood Pressure in Telugu?)

రక్తపోటు అంటే రక్త నాళాల గోడలపై రక్తం మోపే ఒత్తిడి. దానివల్ల, రక్తం గుండె నుండి రక్తనాళాల్లోకి ప్రవహించి శరీరమంతటికీ అందుతుంది. అధిక రక్తపోటు అంటే రక్తనాళాలపై పడే ఆ ఒత్తిడి సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండే స్థితి.

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు అంటే ఏమిటి? (What is High Blood Pressure During Pregnancy in Telugu?)

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు వల్ల మామూలు స్థితికి భిన్నంగా శరీరంపై ప్రభావం ఉంటుంది. తత్కారణంగా, అధిక రక్తపోటు ఉన్న గర్భిణీ స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవ సమయంలోను, ప్రసవం అయ్యాక కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అధిక రక్తపోటు వల్ల తల్లి ఆరోగ్యమే కాక గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యం కూడా ప్రమాదంలో ఉన్నట్టే. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు కారణంగా గర్భంలోని శిశువుకు ఆక్సిజన్, పోషకాలు అందటం కష్టమవుతుంది. అకాల జననం ( సరిగ్గా 9 నెలలకు కాకుండా ముందు/తర్వత పుట్టడం), తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, గర్భస్రావం వంటి సమస్యలు దీని వల్ల తలెత్తే ప్రమాదం ఉంది.

గర్భ సమయంలో అధిక రక్తపోటు లక్షణాలు (Symptoms of High BP During Pregnancy in Telugu)

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు లక్షణాలు కొందరు మహిళల్లో అసలు గుర్తించలేనంత స్వల్పంగా కూడా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో జరిగే మార్పులు ఎన్నో ఉంటాయి కనుక ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకోవటం చాలా కీలకం. గర్భిణీ స్త్రీకి 140/90 కంటే ఎక్కువ రక్తపోటు ఉంటే, ప్రెగ్నెన్సీ అధిక రక్తపోటును కనిపెట్టటం సాధ్యం. రక్తపోటు 160/110 కంటే అధికంగా ఉంటే తీవ్ర అధిక రక్తపోటు ఉన్నట్టు లెక్క. 120/80 సాధారణ రక్తపోటు రీడింగ్.

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అధిక రక్తపోటుకు సంకేతాలు ఏమిటో తెలుసుకోవటం చాలా ముఖ్యం. అవి:

  • తీవ్రమైన తలనొప్పి
  • వాంతులు, వికారం
  • మూత్రంలో ప్రోటీన్ అధికంగా ఉండటం (ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యుడిని కలసిన ప్రతిసారీ మూత్రపరీక్ష జరుగుతుంది)
  • కంటిచూపులో తేడాలు
  • పై పొత్తికడుపులో నొప్పి

గర్భ సమయంలో అధిక రక్తపోటుకి కారణాలు (Causes of High BP During Pregnancy in Telugu)

అధిక రక్తపోటు కొందరు స్త్రీలలో కంటే ఇతర స్త్రీలలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అధిక రక్తపోటు రావటానికి ఆస్కారాన్ని పెంచే కొన్ని పరిస్థితులు ఇవి:

  1. మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుంటే
  2. మీ సోదరికో, తల్లికో ఇప్పటికే ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు వచ్చి ఉంటే
  3. మీ వయసు 40 ఏళ్ళ కంటే ఎక్కువ అయితే
  4. గర్భం దాల్చే సమయానికి మీరు అధిక బరువుతో ఉంటే
  5. మీ గర్భంలో కవలపిల్లలు ఉంటే
  6. మీరు ఆఫ్రికన్ అమెరికన్ జాతివారు అయ్యుంటే
  7. గర్భం దాల్చటానికి ముందే మీకు అధిక రక్తపోటు ఉండి ఉంటే

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటును నియంత్రించటానికి టిప్స్ (Tips to Control High BP in During Pregnancy in Telugu?)

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అధిక రక్తపోటును తగ్గించగల కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని:

  • యాపిల్ సిడార్ వెనిగర్
  • వ్యాయామం
  • అరటిపళ్ళు తినటం
  • సోడియం వాడకాన్ని నియంత్రించటం
  • ఒత్తిడిని నివారించటం
  • మెగ్నీషియం సరైన మోతాదులో తీసుకోవటం
  • పొగ త్రాగటం, మద్యం సేవించటం మానేయటం
  • జంక్ ఫుడ్ తగ్గించటం
  • కెఫిన్ తీసుకోవటం మానేయటం

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అధిక రక్తపోటుని నియంత్రించటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముందుగా ప్రెగ్నెన్సీ సమయంలో మీ వైద్యునితో ఉన్న ఏ ఒక్క అపాయింట్మెంట్ ను అస్సలు మానకూడదు. వైద్యుడు వాడమన్న మందులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తగిన సమయానికి వాడాలి. సరైన ఆహార వ్యాయామాలతో ఆరోగ్యకర జీవన విధానాన్ని అవలంబించాలి. కెఫిన్ వాడకం, పొగ తాగటం, మద్యం సేవించటం మానేయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా? అవి పూర్తిగా నిషేధం!

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు - రకాలు (Types of Blood Pressure During Pregnancy in Telugu)

క్రానిక్ హైపటెన్షన్ (దీర్ఘకాలిక రక్తపోటు) (Chronic Hyper Tension BP)

గర్భం దాల్చటానికంటే ముందు నుండి ఉన్న అధిక రక్తపోటు ఇది. ప్రెగ్నెన్సీ సమయంలో 20వ వారం కంటే ముందు అధిక రక్తపోటును ప్రీఎక్లాంప్సియా అంటారు. అధిక రక్తపోటు ఉన్న గర్భిణీ స్త్రీలకు దాని గురించి వైద్యుడిని కలిసే వరకు తెలియకపోవచ్చు కూడా. దీర్ఘకాలిక అధిక రక్తపోటును నియంత్రించకపోతే ప్రీఎక్లాంప్సియా మరియు ఇతర ప్రమాదకర సమస్యలు తలెత్తవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు స్వల్పంగానే ఉన్నా కూడా వైద్యుడిని తప్పనిసరిగా కలవాలి.

జెస్టేషనల్ హైపర్టెన్షన్ (ప్రెగ్నెన్సీ సమయ రక్తపోటు) (Gestational Hyper Tension During Pregnancy)

ప్రెగ్నెన్సీ సమయంలో 20వ వారం తర్వాత రక్తపోటు పెరుగుతుంది. సాధారణంగా ఈ అధిక రక్తపోటు మీకు గానీ, మీ బిడ్డకు గానీ హానికరం కాదు. ప్రత్యేకించి ఎటువంటి లక్షణాలూ మీకు కనిపించకపోవచ్చు కూడా. అయినప్పటికీ ఇటువంటి అధిక రక్తపోటు ఒక్కోసారి ప్రమాదకరం కావచ్చు. దీని కారణంగా మీ బిడ్డ మామూలు కంటే తక్కువ బరువుతో పుట్టచ్చు. దీనివల్ల మీ బిడ్డ త్వరగా పుట్టవచ్చు. ప్రీఎక్లాంప్సియాకి అవకాశం ఉంది. బిడ్డ పుట్టిన మూడు నెలల లోపు ఇది తగ్గిపోయినప్పటికీ, దీనివల్ల భవిష్యత్తులో అధిక రక్తపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.

దీర్ఘకాలిక రక్తపోటు, ఆపైన ప్రీఎక్లాంప్సియా (Long Lasting BP, Pre-Eclampsia)

గర్భధారణకు ముందే దీర్ఘకాలిక అధిక రక్తపోటు ఉండే మహిళలు ఎదుర్కొనే సమస్య ఇది. అటువంటి మహిళల్లో అధిక రక్తపోటు తీవ్రరూపం దాల్చటం, మూత్రంలో మాంసకృతులు ఉండటం, ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటుకు సంబంధించి ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

ప్రీఎక్లాంప్సియా (Pre-Eclampsia)

ప్రెగ్నెన్సీ సమయంలో అధిక రక్తపోటు వల్ల ఏర్పడే సమస్యల్లో ప్రీఎక్లాంప్సియా ఒక తీవ్రమైన సమస్య. సాధారణంగా గర్భిణీలో 20 వారాల సమయంలో ఇది పెంపొందుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో, బిడ్డ పుట్టిన 48 గంటల లోపు కూడా ఇది సంభవించవచ్చు. సమయానికి చికిత్స అందకపోతే ఇతర అవయవ వ్యవస్థలకు కూడా హాని జరుగుతుంది. పూర్వం, అధిక రక్తపోటు ఉన్న గర్భిణీ స్త్రీలలో మూత్రంలో మాంసకృతులు కనిపించేవారిలో మాత్రమే ప్రీఎక్లాంప్సియా సంభవిస్తుంది అనుకునేవారు. కానీ ఇటీవలి పరిశోధనల సారాంశం ప్రకారం మూత్రంలో మాంసకృతులు లేకపోయినప్పటికీ ప్రీఎక్లాంప్సియా సంభవించవచ్చు. అధిక రక్తపోటుకు లేదా మాంసకృతులతో కూడిన మూత్రం ఉండే గర్భిణీ స్త్రీలలో ఉండే అధిక రక్తపోటుకు ఉప ఉత్పత్తులు ప్రీఎక్లాంప్సియా మరియు ఎక్లాంప్సియా. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీఎక్లాంప్సియా అధిక రక్తపోటు యొక్క ప్రాథమిక ప్రభావం. ప్రీఎక్లాంప్సియాను సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయకపోతే, అది తరువాతి స్థాయికి చేరి ఎక్లాంప్సియాగా రూపుదిద్దుకుంటుంది. ఎక్లాంప్సియా లక్షణాలు మూర్ఛ, ఒక్కోసారి కోమా కూడా కావచ్చు. ప్రీఎక్లాంప్సియా మరియు ఎక్లాంప్సియా ప్రెగ్నెన్సీ సమయంలో 20 వారాలకు లేదా బిడ్డ పుట్టిన 48 గంటల లోపు కూడా సంభవించవచ్చు. ప్రీఎక్లాంప్సియా సంభవించే అవకాశం గర్భిణిలో 4-6 వారాల వరకు కూడా ఉందని పరిశోధన చెప్తోంది. ప్రీఎక్లాంప్సియాను పూర్వం ‘టాక్సీమియా ఆఫ్ ప్రెగ్నన్సీ’ అని పిలిచేవారు. దీన్ని సరైన సమయంలో నియంత్రించకపోతే, ప్రతి 200 మంది మహిళల్లో ఒకరిలో ఎక్లాంప్సియాగా పరిణమిస్తుందని ఒక సర్వే చెప్తోంది.

ప్రీఎక్లాంప్సియా లక్షణాలు (Pre-Eclampsia Symptoms)

ప్రీఎక్లాంప్సియా లక్షణాలు మొదట్లో ప్రమాద ఘంటికలు మోగించకపోవచ్చు. అయినప్పటికీ వాటిపట్ల అవగాహనతో, జాగురూకతతో ఉండాలి. ప్రీఎక్లాంప్సియా లక్షణాలు మళ్లీ మళ్లీ కనబడుతుంటే, వీలైనంత త్వరగా స్త్రీ నిపుణ వైద్యులను కలవాలి. ఈ క్రింది లక్షణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి:

  • చేతులు, ముఖం ఉబ్బినట్టు కనిపించటం
  • ఉన్నట్టుండి బరువు పెరగటం
  • శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది
  • వికారం, వాంతులు
  • తీవ్ర దీర్ఘకాలిక తలనొప్పి
  • కంటిచూపులో ఇబ్బంది
  • భుజాలు, పొత్తికడుపు పైభాగంలో నొప్పి

తీవ్ర ప్రీఎక్లాంప్సియా లక్షణాలలో కొన్ని: (Sever Pre-Eclampsia Symptoms)

  • ఊపిరితిత్తులు ద్రవాలతో నిండటం
  • కంటిచూపులో తీవ్ర సమస్యలు
  • కళ్ళు తిరగటం
  • మానసిక స్థితిలో మార్పులు
  • మూత్రం తక్కువసార్లు రావటం
  • మూత్రపిండాలు, కాలేయం పనితీరు కుంటుపడటం
  • ప్లేట్లెట్ సంఖ్య విపరీతంగా తగ్గిపోవటం
  • తీవ్ర తలనొప్పి
  • పొత్తికడుపు పైభాగంలో నొప్పి
  • సిస్టోలిక్ 160 mm Hg కంటే ఎక్కువ, డయాస్టోలిక్ 110 mm Hg కంటే ఎక్కువ రక్తపోటు

ప్రీఎక్లాంప్సియాకు కారణాలు (Causes of Pre-Eclampsia in Telugu)

ప్రీఎక్లాంప్సియా సంభవించటానికి ఫలానా కారణం అంటూ ఏమీ లేదు. అయితే గర్భస్థ మావి అసాధారణంగా పెరగటం వల్ల, జన్యు కారణాల వల్ల, వాతావరణ ప్రభావం వల్ల ఇలా జరగవచ్చని సిద్ధాంతాలు ఉన్నాయి. దానికి తోడు అధిక బరువు లాంటి పోషకాహార కారణాలు, రోగ నిరోధక శక్తిలో కొరత కూడా ప్రీఎక్లాంప్సియాకు కారణం కావచ్చు. ఈ రెండు పరిస్థితులు ఎలా సంభవిస్తాయో చెప్పే సరైన సిద్ధాంతం లేకపోయినప్పటికీ ప్రీఎక్లాంప్సియాకు లొంగేలా చేసే కొన్ని అంశాలు ఉన్నాయని తెలుసుకోవటం ఆవశ్యకం. ఉదాహరణకు మీరు యుక్త వయసులో ఉన్నా, 40 కి పైబడి వయసు మీకున్నా, మీకు అధిక బరువు ఉంటే, గర్భధారణకి ముందు మీకు అధిక రక్తపోటు సమస్యలు ఉండి ఉంటే, ఇంతకు ముందరి గర్భంలో మీకు ప్రీఎక్లాంప్సియా వచ్చి ఉంటే, ప్రీఎక్లాంప్సియా ఉన్న తల్లి లేదా సోదరి మీకు అండదానం చేసి ఉంటే, మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మధుమేహం, లూపస్, మూత్రపిండ రుగ్మత, ఆర్థ్రైటిస్ వంటివి ఉంటే కూడా మీకు ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువ.

ప్రీఎక్లాంప్సియా వ్యాధి నిర్ధారణ (Pre-Eclampsia Disease Diagnosis)

ప్రీక్లాంప్సియా కోసం ముందస్తు నర్సింగ్ డయగ్నాస్టిక్ రెగ్యులర్ ప్రీనాటల్ కేర్ ద్వారా బాగా నిర్వహించబడుతుంది. ప్రీఎక్లాంప్సియా లక్షణాలు కనిపించగానే (ముఖ్యంగా గర్భ ధారణకు ముందుగా అధిక రక్తపోటు మీకు ఉండి ఉంటే) మీ వైద్యునికి వెంటనే తెలియపరచండి. తద్వారా మీ వైద్యుడు మరింత త్వరగా మీ సమస్యను కనుగొనే అవకాశం ఉంటుంది. ప్రీఎక్లాంప్సియాను కనుగొనాలంటే, మీ వైద్యుడు ఏ ఒక్క లక్షణాన్ని బట్టో కాక, ఇంకా చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకి మూత్రంలో మాంసకృతులు ఉండటం అనేది ఒక లక్షణం అయ్యుండచ్చు, కానీ ఇది మాత్రమే లక్షణం కాదు.

ప్రీఎక్లాంప్సియాను నిర్ధారించటానికి ఒక దారి వైద్యుడు నిర్దేశించిన రక్త పరీక్షలు, మూత్రపరీక్షలు చేయించుకోవటం. ఈ పరీక్షలకి తోడు మీ వైద్యుడు అల్ట్రాసౌండ్, ఫీటల్ మానిటరింగ్ కూడా చేసి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించి, మీ రక్తం ఎంత బాగా గడ్డ కట్టగలదో తెలుసుకుంటారు. ఇటీవల కాంగో రెడ్ స్పాటింగ్ టెస్ట్ వచ్చింది. ఈ టెస్ట్ ద్వారా మూత్రపరీక్షల కంటే ప్రభావవంతంగా ప్రీఎక్లాంప్సియాను కనుగొనటం సాధ్యమవుతోంది. మూత్రంలో ఉన్న మాంసకృతులను కాంగో రెడ్ స్టెయిన్ మరింత విజయవంతంగా హత్తుకోగలుగుతోంది. కానీ ఈ పరీక్షల్లో ఏది జరగాలన్నా, వైద్యులను కలవటానికి జీవితంలో చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వాలి.

ప్రీఎక్లాంప్సియా యొక్క చికిత్స (Treatment for Pre-Eclamspia in Telugu)

గర్భ సమయంలో ప్రీఎక్లాంప్సియా నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి మీ బిడ్డ పుట్టిన తర్వాతే. అంటే దానికి చికిత్స చేయకూడదని కాదు. సరైన సమయంలో ప్రీఎక్లాంప్సియాకు చికిత్స చేస్తే పరిస్థితి విషమించకుండా ఉంటుంది, హెల్ప్ సిండ్రోమ్, ఎక్లాంప్సియా లాంటి మరిన్ని సమస్యలకు దారితీయకుండా ఉంటుంది. ప్రీఎక్లాంప్సియా స్వల్పమే అయితే, మీ వైద్యులు మీకు సఫారసు చేసేది ఇవి:

  • పరిస్థితి పురోగతిని పర్యవేక్షించడానికి సాధారణ రక్త, మూత్ర పరీక్షలు, ప్లేట్‌లెట్ కౌంట్, కాలేయ ఎంజైమ్‌లు, మూత్రపిండ పనితీరు, మూత్ర ప్రోటీన్ స్థాయిలలో మార్పులను తనిఖీ చేసుకోవటం
  • రక్తపోటు ఎంత ఉందో తరచూ చూసుకుంటూ ఉండటం
  • ప్రెగ్రెన్సీ సమయంలో మూడో త్రైమాసికంలో తరచు గర్భస్థ శిశువు ఎన్నిసార్లు తంతున్నదో పర్యవేక్షిస్తూ ఉండటం
  • ఆహారంలో మార్పులు. పచ్చని కాయకూరలు, ఆకుకూరలు, మాంసకృతులున్న ఆహారం తినటం, పుష్కలంగా తాగటం, పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవటం, కుదిరినంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించటం
  • మిమ్మల్ని ఖచ్చితంగా మంచంపైనే విశ్రాంతి తీసుకోమనచ్చు. దీనివల్ల మీ ప్రసవానికి సమయం కొంచెం అటు జరుగుతుంది, గర్భంలోని శిశువు పెరగటానికి ఎక్కువ సమయం, మీ ప్రసవం సురక్షితంగా అవ్వటానికి అవకాశం దొరుకుతుంది.
  • మొదటి రోజుల్లో మీ స్థితి నిలకడగా ఉందని, లక్షణాల్లో తీవ్రత లేదని రూఢీ చేసుకోవటానికి ఆసుపత్రిలో చేరమని అనచ్చు. శిశువు ఆరోగ్యంగా పెరటానికి మీకు కార్టికో స్టెరాయిడ్స్ కూడా ఇవ్వవచ్చు.
  • మీరు, మీ ప్రసూతి వైద్యులు 37 వారాల సమయంలో ప్రసవం గురించి చర్చించటం మొదలుపెట్టవచ్చు. అవసరమైతే ప్రసూతి వచ్చేలా చేయవచ్చు ముందుగా మందులతో మొదలుపెట్టి. గర్భస్థ శిశువు పరిస్థితి బాగా లేకపోతే, ముందుగా ప్రసవం చేయాల్సిన అవసరం ఉండచ్చు. ప్రీఎక్లాంప్సియా ఉన్న స్త్రీలకు సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉండచ్చు, కానీ పురుటి సమయంలో ఇబ్బందులు ఎదురైతే సిజేరియన్ సెక్షన్ చేయాల్సిన అవసరం పడచ్చు.
  • ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీఎక్లాంప్సియా తల్లికి, బిడ్డకి కూడా క్లిష్ట పరిస్థితి. అయితే మీరు పైన చెప్పబడిన విషయాలన్నీ సరిగ్గా అనుసరిస్తే, ప్రీఎక్లాంప్సియా ను ఎదుర్కోవటం సులభం అవుతుంది.

Tags:

High Blood Pressure in telugu, High Blood Pressure symptoms in telugu, treatment for High Blood Pressure in telugu, High Blood Pressure during pregnancy in telugu, High Blood Pressure in pregnant ladies in telugu.

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.